ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి సమావేశం

హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి అనుబంధ సంఘాల జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి దోర్నాల రాజేంద్ర మాదిగ సభ అధ్యక్షులుగా వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి హాజరైనారు అనంతరం మాట్లాడుతూ మందకృష్ణ మాయ గత 30 ఏళ్ల పోరాట చరిత్ర కలిగినటువంటి 59 ఉపకులాలకు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది తీర్పు ఇచ్చిన రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నామని ఎస్సీ వర్గీకరణ అమలుపై అధ్యయనం చేయడానికి కమిటీ వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలుపై సిఫార్సులు చేయడానికి కమిటీ వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటను విస్మరించుకొని మాలలకు కొమ్ముకాస్తూ డీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ ఆగమేఘాల మీద మాదిగలకు మాదిగ ఉపకులాలకు అన్యాయం చేస్తూ 11 062 డీఎస్సీ ఉద్యోగాల ఫలితాలను ప్రకటించడం అలాగే ఈ నెల 9వ తారీఖున ఉద్యోగాల నియామక పత్రాలు అందిస్తామని చెప్పడం మరియు అతి త్వరలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగ ఫలితాలు కూడా ప్రకటిస్తామని చెప్పడం తో పాటు అన్ని ప్రభుత్వ శాఖలలో కూడా అతి త్వరలో ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పడంతో మనం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది సుప్రీం కోర్టు తీర్పు వచ్చాక కూడా ఎస్సీ వర్గీకరణ లేకుండా వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ జరుపుతుండడం ఉద్యోగుల భర్తీ చేయడం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిగలకు తియ్యటి మాటలు చెప్పి మాలలకు అవకాశా లను దోచిపెట్టె కుతంత్రానికి తెరలేపినట్లేనని మనకు అర్థం అవుతుంది దీనిని మనం ఎదుర్కోవలసి వస్తుంది అందుకోసం మనం సిద్ధ పడదామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ పిలుపునిచ్చారు తదనంతరం తొమ్మిదవ తారీకు నిరసన కార్యక్రమం 15వ తారీకు హైదరాబాదులో సభ విజయవంతనికై భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాల ఇన్చార్జిలను ప్రకటించడం జరిగింది భూపాలపల్లి రూరల్ అర్బన్ ఇన్చార్జిలుగా దోర్నాల రాజేందర్ మాదిగ అంతడుపుల సురేష్ మాదిగ నేర్పటి అశోక్ మాదిగ మంద కిరణ్ మాదిగ దోర్నాల భరత్ మాదిగ మంద తిరుపతి మాదిగ మడిపల్లి సుమన్ మాదిగ గణపురం మండల ఇన్చార్జిగా బొల్లి బాబు మాదిగ రేగొండ మండలం ఇన్చార్జిగా నోముల శ్రీనివాస్ మాదిగ గొరికొత్తపల్లి మండలం ఇన్చార్జిగా గాజుల బిక్షపతి మాదిగ మొగుళ్లపల్లి మండలం ఇన్చార్జిగా రేణిగుంట్ల రవి మాదిగ మంచినీళ్ల వైకుంఠ మాదిగ టేకుమట్ల మండల ఇన్చార్జిగా రామ్ రామ్ చందర్ మాదిగ రేణిగుంట్ల శంకర్ మాదిగ చిట్యాల మండలం ఇన్చార్జిగా అంబాల చంద్రమౌళి మాదిగ నోముల శ్రీనివాస్ మాదిగ కాటారం మహా ముత్తారం మండలాల ఇన్చార్జిలుగా మారపాక లచ్చయ్య మాదిగ మంతెన చిరంజీవి మాదిగ పుల్యాల రాజయ్య మాదిగ మనోహర్ రావు మండల ఇన్చార్జిగా కేసరపు నరేష్ మాదిగ మహాదేవపూర్ మండలం ఇన్చార్జిల్గా తూర్చేర్ల దుర్గయ్య మాదిగ బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆయిళ్ల సమ్మయ్య మాదిగ పలిమెల మండలం ఇన్చార్జిగ పత్తి మల్లేష్ మాదిగ జిల్లాల నాగరాజు మాదిగ లను ఇన్చార్జిగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మండల నాయకులు పెరుక బాబు మాదిగ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!