పరకాల నేటిధాత్రి మంగళవారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ ఆధ్వర్యంలో మల్లికార్జున కార్గే,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా మంద రాజు మాదిగ హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే
అందులో ఒక్క సీటు కూడ మాదిగలకు కేటాయించక పోవడం బాధాకరం
కాంగ్రెస్ పార్టీ పూర్తిగ మాలల పార్టీ గ మారింది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే తన మాల కులస్తులకే ఎంపీ సీట్లు కేటాయిస్తున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా మాలల చేతుల్లో బంది అయ్యాడు
మాదిగల జనాభా 75% ఉన్న ఒక్క ఎంపీ సీటు ఇవ్వకుండా మాదిగలను అణిచివేతకు గురి చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క మాదిగ బిడ్డను కూడా ఎదగనీయకుండా నేను మాదిగనని చెప్పుకుంటూ కడియం శ్రీహరి తన రాజకీయ జీవితము అంచలంచలుగా ఎదుగుకుంటూ ఇపుడు వరంగల్ పార్లమెంట్ ఎంపీ సీటు తన కూతురికి కావ్యకు ఇప్పించడం మాదిగలకు బాధాకరమని మాదిగ కులస్తులు 100% కడియం కావ్యను మాదిగ పల్లెలలో మాదిగ గ్రామాలలో మండల కేంద్రంలో నియోజకవర్గం లో జిల్లా కేంద్రంలో రానీయమని ఓడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో
చాతాళ్ళ రమేష్ మాదిగ
ఎంమ్మార్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
ఏక్ శంకర్ మాదిగ,రాష్ట్ర కార్యదర్శి
జిల్లెల్ల మురళి మాదిగ,రాష్ట్ర కార్యదర్శి
ఇనుముల పూర్ణయ్య మాదిగ,జిల్లా ఉపాధ్యక్షులు
గజ్జి మధు,దామెర మండల అధ్యక్షులు
ఆత్మకూరు మండలం ఇన్చార్జి గోవిందు రవికుమార్ మాదిగ,
పరికి విజయ్ మాదిగ,రఘు మాదిగ,ప్రసాద్ మాదిగ,ప్రదీప్ మాదిగ,వినయ్ మాదిగ,నాగరాజు మాదిగ, జైపాల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.