MLRIT Student Selected for Viksit Bharat Young Leaders Dialogue 2026
జాతీయస్థాయి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 పోటీలకు ఎంపికైన ఎంఎల్ఆర్ఐటీ విధ్యార్థిని విప్లవ కు మర్రి రాజశేఖరరెడ్డి ప్రశంసలు
మల్కాజిగిరి నేటిధాత్రి
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 లో భాగంగా నిర్వహించిన పోటీల్లో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులో మూడవ సంవత్సరం చదువుతూ జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) లో చురుకుగా పాల్గొంటున్న కోడూరి విప్లవ జాతీయ స్థాయిలో జరగబోయే ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ఎంపికవడం తమ కళాశాలకు గర్వకారణమని కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ఫౌండర్ సెక్రెటరీ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో నాలుగు దశల్లో క్విజ్, ఎస్సే రైటింగ్, ప్రజెంటేషన్, ఇంటర్వూ లాంటి పోటీల్లో పాల్గొన్న ఈ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 లో తమ కళాశాలకు చెందిన కోడూరి విప్లవ జాతీయస్థాయికి ఎంపికవటం పట్ల మర్రి రాజశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ కళాశాలలో వివిధ రంగాల్లో విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దుతున్నామని, హ సస్టైనబిలిటీ మరియు గ్రీన్ వికసిత్ భారత్ అనే అంశం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో విప్లవ తన ఆలోచనలు పంచుకోనుండడం ఒక గొప్ప అవకాశమని తెలియజేస్తూ ఎన్ ఎస్ ఎస్ వాలంటీరు విప్లవ మరియు ప్రోత్సహించిన తమ కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ నాయిని ఉదయ్ రంజన్ గౌడ్ లను అభినందించారు.
ఈనెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఢిల్లీలోని భారత మండపంలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఈ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 పోటీల్లో సస్టైనబులిటీ మరియు గ్రీన్ వికసిత్ భారత్ అనే అంశం మీద మాట్లాడబోతున్న విప్లవ రాణించాలని ఆకాంక్షించారు రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ కే శ్రీనివాసరావు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నాయిని ఉదయ్ రంజన్ గౌడ్ విప్లవను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
