# ఈడీపై సుప్రీం కోర్టులో పిటిషన్..
హైదరాబాద్,నేటిధాత్రి :
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ అక్రమమని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం ఎల్లుండి విచారణకు ఆదేశించింది. దీనిపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నారు. ఈడీని ప్రతివాదులుగా చేరుస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీంలో తాజాగా వేసిన పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ అక్రమమని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం ఎల్లుండి విచారణకు ఆదేశించింది. దీనిపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నారు. ఈడీని ప్రతివాదులుగా చేరుస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీంలో తాజాగా వేసిన పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు. నేతల ఆదేశాలతోనే ఈడీ తనను అరెస్టు చేసిందంటున్నారు. అరెస్ట్ చేయిస్తామని కొందరు నేతలు బహిరంగంగా ప్రకటించారని ఎమ్మెల్సీ కవిత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా కావాలని ఈ కేసులో తనను ఇరికించేలా ఈడీ ప్లాన్ చేసిందని ఆరోపిస్తున్నారు. కొందరు నిందితుల స్టేట్‌మెంట్ల ఆధారంగా ఇరికించారన్న కవిత.. చార్జ్‌షీట్లలో ఎక్కడా తనను నిందితురాలుగా పేర్కొనలేదని స్పష్టం చేస్తున్నారు. ఈడీ ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరించిందని ఆరోపించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఢిల్లీకి తరలించింది, ఈడీ రిమాండ్ ను రద్దుచేసి తనను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌లో సుప్రీం కోర్టును కోరారు.