గండ్లు పడిన చెరువులకు మరమ్మత్తు చేయించని దౌర్బాగ్య పార్టీ బీఆర్ ఎస్.
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీ కృష్ణ.
చిట్యాల, నేటి దాత్రి
– జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీ కృష్ణ మాట్లాడుతూ రైతులను తప్పుదోవ పట్టించేందుకు మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనచారి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. గత సంవత్సరం జూలైలో భారీ వర్షాలకు నియోజకవర్గం వ్యాప్తంగా ఎస్సార్ ఎస్పీ కాల్వలు, చెరువులు, కుంటలు తెగిపోతే మారమ్మత్తు పనులు చేయించని అసమర్థ ప్రభుత్వం బిఆరెస్అని , అసమర్థ నాయకులు ఆపార్టి నాయకులు అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తోనే సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా నిర్వహించి, కోట్లాది నిధులను మంజూరి చేయించిన ఘనత ఎమ్మెల్యే, ప్రజానాయకుడు గండ్ర సత్యనారాయణ రావు అని అన్నారు. వానాకాలం లోపు కాల్వలు, చెరువుల మరమ్మత్తు పనులు పూర్తి చేయించి రైతులకు సాగు నీరు అందిస్తామన్నారు. తొమ్మిది సంవత్సరాలు రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని మీరు రాజకీయ పబ్బం గడిపేందుకే రైతులను ఆదుకోవల్సింది పోయి రైతులను రెచ్చగొట్టి ప్రతిపక్ష పార్టీల నాయకులు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని,కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలకే ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసే విధంగా ముందుకుసాగుతున్నారు..కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వెయ్యడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చిలుకల రాయకొమురు,స్థానిక ఎంపీటీసీ ధబ్బేట అనిల్,మండల కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ రాజ్ మహ్మద్, టౌన్ యూత్ అద్యక్షులు అల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.