ఎమ్మెల్యే దొంతిని కలిసిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
నర్సంపేట, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పిఆర్టియు అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి హనుమకొండలోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.