
జెడ్పిటిసి జోరుక సదయ్య
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
ప్రజల పక్షాన నిలబడి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే ఏనుగుల రాకేష్ రెడ్డి ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుని.. ఏనుగుల రాకేష్ రెడ్డి తమరి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా జెడ్పిటిసి జోరుక సదయ్య పట్టభద్రులకు పిలుపునిచ్చారు. . తెలంగాణలో ప్రజాస్వామ్యం తరఫున పోరాడిన ఏకైక వ్యక్తి కెసిఆర్ తెలంగాణ సాధించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడు నేడు బిఆర్ఎస్ పార్టీబలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో నిలవబోతున్నాడన్నారు. ఈనెల 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును రాకేష్ రెడ్డి వేసి ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకను శాసనమండలిలో నిలపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ వంకర బుద్ధిని ప్రజలు గమనించి ఓట్ల రూపంలో తగిన గుణపాఠం చెప్పారని మరోసారి వస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు పట్టబడుదులు ఓటర్లు అందరూ మొదటి ప్రాధాన్యత ఓటును ఏనుగుల రాకేష్ రెడ్డికి వేసి అధిక మెజార్టీతో గెలిపియాలని కోరారు ప్రజల కోసం ఆలోచించే విద్యావంతుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ఎమ్మెస్. ఎంఎంఎస్. బిట్స్ . పిల్లాని గొప్ప గొప్ప చదువులు చదివినాడు ప్రజల పక్షాన నిలబడడం జరిగింది శాసనమండలిలో సైతం బిఆర్ఎస్ పార్టీ గొంతుకలు ఉంటేనే ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, యువతకు ఇలా అన్ని వర్గాల వారికి మేలుజరుగుతుందన్నారు. పట్టభద్రులందరూ ఆలోచించాలని..మోసపూరిత మాటలకు మోసపోవద్దని, ప్రశ్నించే గొంతుకగు రాకేష్ రెడ్డిగెలిపించి శాసన మండలకి పంపాలన్నారు.