-పార్టీ మారి కాంగ్రెస్ లో ఇమడలేకపోతున్నారు
-సముద్రంలో కలిసి ప్రయాణం చేయలేకపోతున్నారు
-మేమొస్తాం…తలుపులు తీస్తారా? అని వేడుకుంటున్నారు
-క్షమించి మమ్మల్ని రమ్మంటారా?
-వెళ్ళి తప్పు చేశాం…క్షమించలేరా!
-రమ్మంటే పరుగెత్తుకొస్తాం
-మేమక్కడ నెగలలేకపోతున్నాం…
-కాంగ్రెస్ నేతలతో కలవలేకపోతున్నాం
-ఎంత చొచ్చుకొని వెళ్లినా ఆదరించడం లేదు
-ఎమ్మెల్యే అనే అభిమానం కనిపించడం లేదు
-మమ్మల్ని అక్కున చేర్చుకోవడం లేదు
-ప్రజల ముందు చులకనయ్యాం
-ఇప్పటి దాక వున్న అనుచరులకు లోకువౌతున్నాం
-కాంగ్రెస్ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేకపోతున్నాం
-పార్టీ మారిన ఎమ్మెల్యేలు పడరాని పాట్లు పడుతున్నారు
-ముందు నుయ్యి, వెనుక గొయ్యి తొవ్వుకున్నారు
-ఎమ్మెల్యేలను ఆదరించకపోవడంలో కాంగ్రెస్ నాయకుల తప్పేం లేదు
-పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించింది వీళ్లే
-పదేళ్లు పడరాని పాట్లు పడి కాంగ్రెస్ కోసం పనిచేశారు
-అనేక కేసులు ఎదుర్కొన్నారు
-నిర్భంధాలు చూశారు…పోలీసు దెబ్బలు తిన్నారు
-పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెత్తనం లేక కాంగ్రెస్ నాయకులు సలసల కాగుతున్నారు
-పార్టీ మారిన ఎమ్మెల్యే లకు సలాం కొట్టలేకపోతున్నారు
-కాంగ్రెస్ నాయకులు పాత బకాయిలు తీర్చుకునే సమయంలో వచ్చి చేయందుకున్నారు
-ఇది కాంగ్రెస్ నేతలకు సుతారం ఇష్టం లేదు
-అప్పుడు అదే ఎమ్మెల్యే పెత్తనం.. ఇప్పుడు అదే ఆధిపత్యం
-కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు
-ఎమ్మెల్యేలైనా సరే లెక్క చేయడం లేదు
-ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుల వెంటనే కార్యకర్తలుంటున్నారు
-పార్టీ మారిన ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి పౌరులైపోయారు
-కాంగ్రెస్ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కుబిక్కుమంటున్నారు
-రాజకీయంగా భవిష్యత్తు అంధకారం చేసుకున్నని మధనపడుతున్నారు
హైదరాబాద్,నేటిధాత్రి:
తొందర పాటు గ్రహపాటైంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి చేజేతులా తవ్వుకున్నట్లైంది. అత్యాశ దురాశగా, పేరాశా మిగిలిపోయింది. సముద్రం లాంటి కాంగ్రెస్‌లో అందరూ కలవలేరు. ఒక్కసారి ఆ పార్టీలో కలిస్తే మాత్రం పార్టీని వదులుకోలేరు. అందువల్ల మొదటి నుంచి కాంగ్రెస్‌లోవున్న వారికి ఆ పార్టీ ఎంతో గొప్పది. కాంగ్రెస్ పార్టీలో వున్నంత అంతర్గత ప్రజాస్వామ్యమం మరే పార్టీలో వుండదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో అసలే వుండదు. కాని తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేకు అక్కడా దక్కలేదు. ఇక్కడా విలువలేకుండాపోయింది. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నా, కాంగ్రెస్ నాయకులమని చెప్పుకోలేకపోతున్నారు. అటు బిఆర్‌ఎస్ పార్టీని తిట్టలేకపోతున్నారు. అటు కాకుండా, ఇటు కాకుండా పోయి, రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకున్నారు. ఇప్పుడు మధనపడినా వచ్చేది లేదు. ఒరిగేది లేదు. అంతో ఇంత కాంగ్రెస్‌లోనే ఏదైనా ఆదరణ దొరకాలే గాని, తిరిగి ఘర్ వాపసీ అంటే మాత్రం అక్కడ ఇసుమంతైనా గౌరవం దక్కకపోవచ్చు. ప్రాదాన్యత పెద్దగా వుండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్దితుల్లో టికెట్ దక్కకపోవచ్చు. కాంగ్రెస్‌లో కొనసాగినా అదే జరగొచ్చు. రెంటికీ చెడిన రేవడిగా మారింది ఎమ్మెల్యేల పరిస్దితి. పార్టీ మారేముందు కొంచె ఆలోచిస్తే ఇంత దూరం వచ్చి వుండేది కాదు. కాంగ్రెస్‌పార్టీ పదేళ్ల కాలం పాటు అధికారం కోల్పోయింది. కాంగ్రెస్‌నుంచి బిఆర్‌ఎస్‌లో నాయకులు చేరుతూ వుండడంతో చతికిలపడిపోయింది. ఒక దశలో చితికిపోతుందనుకున్నారు. కాని ఆ పార్టీకి వున్న నాయకులు, కార్యకర్తల మూలంగా, కాంగ్రెస్ పార్టీ నిలబడిరది. ఆ పార్టీకి ఇప్పటికీ చెక్కు చెదరని కార్యకర్తలున్నారు. నాయకులు నాడు బిఆర్‌ఎస్‌కు వెళ్లినా అప్పటి ద్వితీయ శ్రేణి నాయకులు ముందు వరసలోకి వచ్చారు. పదేళ్లపాటు కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వచ్చారు. బిఆర్‌ఎస్ పాలనలో నానా ఇబ్బందులు పడ్డారు. కేసులు ఎదుర్కొన్నారు. నిర్భందాలను కూడా చూశారు. పోలీసుల దెబ్బలుతిన్నారు. అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. పార్టీ మారాలని పెట్టిన నిర్భంధాలను కూడా లెక్క చేయకుండా పార్టీ కోసం నిలబడ్డారు. అలాంటి నాయకులున్న కాంగ్రెస్‌పార్టీలోకి అవకాశవాద రాజకీయాలను చేయానుకున్నవారు వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ ఇమలేక, కాంగ్రెస్‌లో నెగలేకపోతున్నారు. ఏదో జరుగుతుందని ఆశపడితే ఏదో అయ్యిందన్నట్లు మారింది. కాంగ్రెస్‌లోవిలువ లేదు. గుర్తింపు అసలే లేదు. కార్యకర్తలు అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గౌరవమే ఇవ్వడం లేదు. అసలు ఎమ్మెల్యేలుగా వారిని పార్టీ శ్రేణులే గుర్తించడం లేదు. అటు కాంగ్రెస్ పట్టించుకోకపోవడమే కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. బిఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకోవాల్సిన సమయంలో కాంగ్రెస్ నాయకులే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రావొద్దంటున్నారు. దాంతో దిక్కు తోచని పరిస్ధితిలో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ మారితే బిఆర్‌ఎస్ నుంచి సమస్యలు ఎదురౌతాయి. బిఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకుంటాయి. అధికారం చేతిలో వుంటుంది. బిఆర్‌ఎస్‌ను అణచివేయొచ్చు. బిఆర్‌ఎస్‌ను తమ తమ నియోజకవర్గాలలో ఖాళీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందొచ్చు. ఇతర పదవులు, నిధులు తెచ్చుకోవచ్చనుకున్నారు. కాని కాంగ్రెస్ పార్టీ నాయకులే రాజకీయం చేస్తారని అనుకోలేదు. కాని కాంగ్రెస్ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేక ఏర్పడుతుందని ఊహించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించలేరు. వారితో కలిసి సఖ్యతను పొందలేకపోతున్నారు. మేమిక్కడ నెగలలేకపోతున్నామంటూ ఆంతరంగికుల వద్ద బోరు మంటున్నారు. వెళ్లి తప్పు చేశామంటూ మధనపడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదరిస్తారనుకుంటే దూరం కొడుతున్నారు. కాంగ్రెస్‌లో కలిసినా, నాయకులతో కలవలేకపోతున్నామంటున్నారు. తాము ఎంత చొచ్చుకెళ్లినా, కాంగ్రెస్ నాయకులను ఎంత భుజ్జగించినా వినడం లేదంటున్నారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురౌతోంది. ఎమ్మెల్యేలమన్న గౌరవం కనీసం కాంగ్రెస్ కార్యకర్తలే ఇవ్వడం లేదు. దాంతో బిఆర్‌ఎస్ శ్రేణులు చూసి సంబరపడుతున్నారు. తమకు మొత్తం మీద గుర్తింపు లేకుండాపోతోందంటున్నారు. ప్రజల ముందు ఎలాగూ చులకనయ్యాం. కాని కాంగ్రెస్ శ్రేణులతోనైనా కలిసిపోదామనుకుంటే ఎమ్మెల్యే వస్తున్నాడని తెలిసినా ఎవరూ వెళ్లడం లేదట. అటు అనుచరులకు కూడా లోకువయ్యే పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేని పరిస్ధితుల్లో ఎలా కొనసాగాలో అర్ధం కాకుండా వుందంటున్నారు. పార్టీ మారి పడరాని పాట్లు పడుతున్నామంటూ బిఆర్‌ఎస్ నాయకులకు గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఎదుకంటే పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులును వేదించింది ఈ ఏ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అప్పుడు అధికారం చెలాంయించి ఇబ్బందులకు గురి చేసింది వీళ్లే. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి పెత్తనం చేయాలని చూస్తున్నది వీల్లే. దాంతో కాంగ్రెస్ నాయకులకు సుతారం నచ్చడం లేదు. పై నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, ఆదేశాలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది కాంగ్రెస్‌లో ఎప్పుడూ వుండే సంస్కృతే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను వేధించిన ఎమ్మెల్యేపై రివెంజ్ తీర్చుకుందామనుకున్నారు. కాని వాళ్లే ఇప్పుడుకాంగ్రెస్‌లో చేరడంతో వాళ్లంతా విస్తుపోతున్నారు. పాత బకాయిలు తీర్చుకోలేకపోతున్నామని కాంగ్రెస్ నాయకులు మధనపడుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నాయకులయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కు బిక్కు మంటున్నారు. రాజకీయం అందకారం చేసుకున్నామంటూ చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎలాగూ ఇమడలేకపోతున్నాం. కనీసం సొంత గూటికి చేరుకుందామా? అని కొంత మంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. బిఆర్‌ఎస్ ఛీప్‌తో కలవాలని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నారట. తప్పయ్యింది. మేమొస్తాం తలుపులు తీస్తారా? అని కేటిఆర్, హరీష్‌రావులను వేడుకుంటున్నారట. క్షమించి మమ్మల్ని రమ్మని చెప్పండంటూ సందేశాలు పంపుతున్నారా? కొంత మంది కాంగ్రెస్ నాయకులతో గొడవలు పడుతూ తమలో గులాబీ రక్తమే వుందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారట. క్షమించి రమ్మనండి? అని వెడుకుంటున్నారట. రమ్మంటే పరుగెత్తుకొస్తామంటూ నాయకులతో కబురు పంపిస్తున్నారట. ఈ ఎమ్మెల్యేలకు కారులో చోటు వుండదని తెలుసు. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ టికెట్ ఇవ్వడని తెలుసు. అయినా కాంగ్రెస్‌లో వుండి చేసేదేమీ లేదు. రోజు తలనొప్పి తప్ప మరేం లేదనుకుంటున్నారట. నిదులొస్తాయని అనుకుంటే మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పోల్చితే వస్తున్న నిధులేమీ లేవు. అసలైన కాంగ్రెస్ నాయకులకు వున్న విలువ, గౌరవం ఎలాగూ దక్కడం లేదు. నిధులు మంజూరు తమ వల్ల కావడం లేదు. కాంగ్రెస్ నాయకులు కోరిన నిధులు ఇస్తున్నారు. పాత కాంగ్రెస్ నాయకుల చేతనే అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి చేతనే కొబ్బరి కాయలు కొట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలను కనీసం దగ్గరకుకూడా రానివ్వడం లేదు. ఇలాంటి పరిస్ధితి ఒక వైపు వుంటే మరో వైపు సుప్రింకోర్టులో కేసు తీర్పు ఎలా వుంటుందన్న భయం మరో వైపు వెంటాడుతోంది. తాజాగా మార్చి 4న సుప్రింకోర్టు మరిన్ని సీరియస్ వ్యాఖ్యలు చేసింది. గడువు కోరిన ప్రభుత్వ తరుపు న్యాయవాదుల పేరుతో ఎమ్మెల్యేల పదవీ గడువు పూర్తయ్యే వరకు కావాలా? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇలాగైతే ప్రజాస్వామ్యం విలువలు పడిపోతాయని సుప్రిం కోర్టు ఘాటుగా హెచ్చరించింది. అంతే కాదు మార్చి 23 వరకు ఏ విషయమైన కోర్టుకు తెలపాలని ప్రభుత్వ తరుపు లాయర్లకు సుప్రింకోర్టు సూచించింది. ఇక మార్చి 23 లోగా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం ప్రకటించే పరిస్దితి ఎదురైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయకపోతే సుప్రింకోర్టు వారిపై వేటు వేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అందుకే ఈలోపే బిఆర్‌ఎస్ గూటికి తిరిగి వెళ్లడం ఎంతో ఉత్తమమని కొంత మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఒక వేళ వెళ్లినా కనీసం తమను గడప కూడా తొక్కనీయరని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ వేటు పడినా మళ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా? ఇచ్చినా గెలిచే పరిస్థితి వుందా? అనుకుంటున్నారట. తొందరపడ్డామా..చేజేతులా చెడగొట్టుకున్నామా? అన్నది అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారట.