
ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జన హృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు
స్థానిక ముద్దు బిడ్డ, శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు గారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాణిక్ రావు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని కోరారు…
ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేషం, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ తాంజిమ్, సీనియర్ నాయకులు నామ రావికిరణ్, ఎస్సి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజీ పట్టణ అధ్యక్షులు యాకుబ్, మోహిద్దీన్,మాజీ కౌన్సిల్లర్ అబ్దుల్లా, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, బిఆర్ఎస్వి అధ్యక్షులు రాకేష్,ఎస్సి సెల్ పట్టణ్ణ అధ్యక్షులు శివప్ప,
పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు కమిటీ సభ్యులు తాజా మాజీ సర్పంచ్ లు, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు కమిటీ సభ్యులు ఉప సర్పంచులు ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ ,బిఆర్ఎస్వి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.