MLA Kale Yadaiah Congratulates Sankepally Representatives
సంకేపల్లి నూతన ప్రజాప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్యే యాదయ్య
నేటిధాత్రి, శంకర్ పల్లి:
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంకేపల్లి గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ సర్పంచ్ గా దేశ్పాండే శ్రీనివాస్, ఉప సర్పంచ్ గా ఉప్పరి రవీందర్ సగర, వార్డ్ మెంబర్లు గా తాళ్లపల్లి రుక్కమ్మ, కవ్వగూడెం మల్లేశం యాదవ్, ఉప్పరి లావణ్య శ్రీనివాస్ సగర, తోకల గోవర్థన్ యాదవ్, తోకల సబిత పరమేశ్వర్ యాదవ్ లు భారీ మెజారిటీతో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ ప్రజాప్రతినిధులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే 5 సంవత్సరాలలో గ్రామాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టడం కోసం కృషి చేస్తానని, గ్రామాభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని హమీ ఇచ్చారు. అనంతరం ప్రజాప్రతినిధులను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
