చేర్యాల జేఏసీ చైర్మన్ రామగళ్ల పరమేశ్వర్
ఈనెల 29న చేర్యాల సడక్ బందుకు పిలుపు
చేర్యాల నేటిధాత్రి…
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దీక్షకు సంఘీభావం కాదు ముఖ్యమంత్రి చేత రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయించాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కోరారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో జరిగిన జేఏసీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాకతాలియంగా సామాన్య సామాజిక కార్యకర్తలాగా వచ్చి దీక్షకు సంఘీభావం తెలపడం కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ చేత రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయించి జీవో తీసుకొచ్చి ఇదే దీక్ష వద్ద ప్రకటన చేయాలని హితవు పలికారు. ఈ దీక్ష స్థలికి ప్రతిరోజు ఎంతోమంది వచ్చి సంఘీభావం తెలుపుతూ మా పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు. దీక్షాస్థలికి ఏ ఉద్దేశంతో వచ్చారో తెలియదు కానీ జేఏసీ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికే వచ్చారని ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందని వారన్నారు. మీ టికెట్ కోసం ఎంత పోరాడినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ ఈ ప్రాంత ప్రజలు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడానికి పోటీపడి ముఖ్యమంత్రిచే రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 29న ముస్త్యాల గ్రామం నుండి మర్రి ముస్త్యాల వరకు మధ్యాహ్నం 12 నుండి 2గంటల వరకు సడక్ బంద్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సడక్ బంద్ కార్యక్రమానికి చేర్యాల ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి, జేఏసీ నియోజకవర్గ నాయకులు ఆముదాల మల్లారెడ్డి, అందె అశోక్, మాజీ జెడ్పిటిసిలు కొమ్ము నర్సింగరావు, బుట్టి సత్యనారాయణ,సుందరగిరి భాస్కర్, బొమ్మగాని అంజయ్య గౌడ్, గద్దల మహేందర్, తడక లింగం, కొంగరి వెంకట్ మావో, కొంగరి వెంకట స్వామి, పుట్ట రాజు, రాళ్లబండి నాగరాజు, చంద శ్రీకాంత్, బిజ్జ రాము,ముంజ మల్లేశం, మిట్టపల్లి నారాయణ రెడ్డి, పోతుగంటి ప్రసాద్, తిగుల్ల కనకయ్య, రామడుగు బాలరాజు, బండి సుదర్శన్,బోయిని మల్లేశం, కుమార్, రాజు, తదితరులు పాల్గొన్నారు.