
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి.
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే నూతన ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు .కీర్తిశేషులు సీనియర్ జర్నలిస్టు మామిడి శరత్ కు నివాళులు అర్పిం చారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాలేశ్వరం నర్సయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులoదరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ పూర్తి కాగానే రెవెన్యూ శాఖతో మాట్లాడి ప్రెస్ క్లబ్ కు శాశ్వత భవన నిర్మాణానికి స్థలం కేటాయించి, భవనాన్ని నిర్మించి ఇస్తామని తెలిపారు. అది ఒక వేదికగా ఉంటుందని అన్నారు. జర్నలిస్టులు ఒక కుటుంబంల కలిసిమెలిసి ఉండాలని అన్నారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులను శాలువా మెమెంటోళ్ళతోసన్మానించారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గాడి పెల్లి మధు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంకణాల సంతోష్,, గుంటి విద్యాసాగర్, పెండ్యాల వేణుమాధవ్, ఐజేయు కౌన్సిల్ సభ్యులు కోడం రవీందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ రామచందర్, ప్రధాన కార్యదర్శి మట్ట దుర్గాప్రసాద్, హనుమకొండ జిల్లా శాఖ కోశాధికారి పురుషోత్తం, ప్రెస్ క్లబ్ కమిటీ ప్రధాన కార్యదర్శి రంగు శ్రీధర్, గౌరవ అధ్యక్షుడు చల్ల రాజిరెడ్డి, ఉపాధ్యక్షులు కొమ్ముల సతీష్, సహాయ కార్యదర్శి క్రాంతి కుమార్, కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.