కేసముద్రం(మహబూబాబాద్),నేటిధాత్రి:
కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో గతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మైనారిటీల కోరిక మేరకు ముస్లింల ఖబరుస్తాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి తన సీడీఎఫ్ నిధుల నుండి 5.00 లక్షల రూపాయలను మంజూరు చేసి మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొసీడింగ్ పత్రాన్ని
మహబూబాబాద్ శాసన సభ్యులు
బానోత్ శంకర్ నాయక్ అందజేశారు.గతంలో ఇచ్చిన మాట ప్రకారం నేడు ముస్లిం మైనారిటీలకు ఉపయోగపడే విధంగా ఇంత గొప్ప పని చేసిన ఎమ్మేల్యే శంకర్ నాయక్ పై హర్షం వ్యక్తం చేస్తూ మీకు ముస్లిం మైనారిటీలు ఎల్లవేళలా అండగా ఉంటామని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెనుగొండ సర్పంచ్ మాచర్ల నిర్మల రమేష్,ఎంపిటిసి దుబ్బకట్ల వెంకన్న,బాలు,జగన్,జావేద్,చాంద్ పాషా,గట్టు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.