మిర్చి రైతుల విద్యుత్ ఇబ్బందులు తొలగించిన ఎమ్మెల్యే

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా చెన్నూరు గోదావరి రోడ్ హనుమాన్ మందిర్ సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ కాలిపోవడంతో అక్కడ మిర్చి సాగు చేసే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని,విషయం తెలుసుకున్న చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి వెంటనే అక్కడ మిర్చి రైతులు నష్టపోకుండా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులకు రైతుల ద్వారా వినతిపత్రం తెప్పించి నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ఏఈ ని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రాన్స్ ఫార్మర్ వినియోగించే రైతులు వారి సర్వీస్ నెంబర్లను తప్పనిసరిగా విద్యుత్ అధికారులకు తెలియజేయాలని,సాగు చేసే సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఎంత మంది రైతులు విద్యుత్ వినియోగం చేస్తున్నారని సమాచారం విద్యుత్ శాఖ అధికారుల వద్ద ఉంటుంది.అది రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుంది.,అలాగే అధికారుల వద్ద రైతుల యొక్క సమాచారాన్ని ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుశీల్ కుమార్,ఇప్ప చంద్రయ్య, తోట శ్రీనివాస్, తోట సంతోష్,నామని బాబు, నీలం లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!