ఎడ్ల పరుగు పందెం పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన సయ్యద్ సలీం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం సయ్యద్ సలీం గారి ఆధ్వర్యంలో రైతుల కోసం జనవరి 26 వ తేదీన నిర్వహిస్తున్న ఎడ్ల పందెం పోటీలకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు బహుమతుల దాత సయ్యద్ సలీం ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యొక్క ఎడ్ల పోటీలను ప్రారంభించారు. అనంతరం మిట్టపల్లి గ్రామ యువకులకు వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే గా గెలుపొందిన సందర్బంగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన మిట్టపల్లి క్రికెట్ టోర్నమెంట్ విలేజ్ లెవల్ గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతి మరియు ట్రోఫీలను క్రీడాకారులకు అందించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్య లేకుండా కృషి చేస్తానని అలాగే గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా తోడుంటానని వారు హామీ ఇవ్వడం జరిగింది.మిషన్ భగీరథ నీటి సరఫరా పై వారు అవినీతి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ యొక్క ఎడ్ల పందెం పోటీలో వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి విచ్చేసిన రైతులు ఈ యొక్క పందెం పోటీలో పాల్గొన్నారు. అనంతరం ఎడ్ల పరుగు పందెం పోటీలో గెలుపొందిన రైతులకు మొదటి బహుమతి,
పావు తులం బంగారం
అచ్చులాపూర్ గ్రామానికి చెందిన పొట్లపల్లి సాగర్ రైతు మొదటి బహుమతి గెలుచుకున్నాడు.
రెండవ, బహుమతిగా కొమ్ము రాజన్న భీమారం10 తులాల వెండి గెలుపొందాడు. మూడవ బహుమతి పెంచల లక్ష్మణ్ పోన్నారం గ్రామానికి చెందిన రైతు కి 8 తులాల వెండి. బహుమతి ఇవ్వడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో బహుమతుల దాత సయ్యద్ సలీం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్,వార్డ్ మెంబర్స్ మరియు కార్య నిర్వహణ కమిటీ సభ్యులు
మల్లేష్,నారాయణ,మిట్టపల్లి
యూత్ మెంబర్స్ ,డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి.శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగయ్య,మల్లేష్, మనోహర్ తదితరులు అలాగే మిట్టపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!