మంచిర్యాల, నేటి ధాత్రి:
సెక్రటేరియట్ లో తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ ఆధ్వర్యంలో కలిసి తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ1179 ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సర్దుబాటు సమస్యలు విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించింది మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తానని చెప్పారు .మరియు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు, ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో కలిసి మన సమస్యలు వారి ద్వారా విన్నవించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పినారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మరియు గృహ నిర్మాణ శాఖ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల నాయకులు మద్దూరి రాజు యాదవ్ ,కుమారస్వామి ,సతీష్, సాగర్ మరియు ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు ,డాటా ఎంట్రీ ఆపరేటర్స్ , రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో ఉద్యోగస్తులు పాల్గొనడం జరిగింది.