సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం బస్టాండ్ సమీపం లోని రాజీవ్ రహదారి పై శుక్రవారం సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఏ హెచ్ కె ఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ సిస్టమును స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వారు మాట్లాడుతూ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుందని, అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగే సంఘటనలు తగ్గుతాయని అన్నారు.ఇందారం ఓసిపి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి పవర్ ప్లాంట్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కొరకు హెచ్ కె ఆర్ సంస్థ చొరవ చూపాలని ఎమ్మెల్యే వివేక్ వారిని కోరారు.