
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ వద్ద శనివారం రోజున మహాలక్ష్మి స్కీం ద్వారా అర్హులైన వారందరికీ ధ్రువపత్రాలను చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో, ఎంపీఓ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి శాలువా కప్పి సత్కరించారు. అలాగే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వమని పేర్కొన్నారు. అనంతరం ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని ప్రభుత్వం ద్వారా ఆర్థిక ఆర్జీలు పెట్టుకోగా వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, ఎంపీఓ శ్రీపతి బాపూరావు, తహసిల్దార్ వనజా రెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.