MLA Revoor Prakash Reddy Consoles Bereaved Family
మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రానికి చెందిన వార్త రిపోర్టర్ బొమ్మ అశోక్ మాతృమూర్తి బొమ్మ విజయ (60) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి వారి నివాసానికి చేరు కొని, ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.అనంతరం మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే రేవూరి వెంట మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్,నడికూడ సర్పంచ్ కుడ్ల మలహాల్ రావు, ఉప సర్పంచ్ తరిగొప్పుల సంపత్, గ్రామ కమిటీ అధ్యక్షుడు తాళ్ళ నవీన్,నాయకులు దురిశెట్టి చంద్రమౌళి,బొమ్మ చంద్రమౌళి గౌడ్,పర్నెం మల్లారెడ్డి,నారగాని కుమార స్వామి, నూతన వార్డ్ మెంబర్ లు, కార్యకర్తలు యూత్ నాయకులు తదితరులున్నారు.
