
వనపర్తి రెండో వార్డ్ లో కార్యకర్తలతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్త లతో కలిసి 2వ వార్డులో వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి పర్యటించి రెండో వార్డు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు . ఈ సందర్భంగా 2వ వార్డు ప్రజలు కొందరు ఇందిరమ్మ ఇల్లు మంజూర అయిందని అన్నదమ్ములు ఉన్నారని ఇల్లు ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం సరి పోవడం లేదని ప్రభుత్వ ఇల్లు మంజూరైన వారు మంజూరు అయినవారు తన తన దృష్టికి తెచ్చారని విషయం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు . కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వనపర్తి పట్టణ ప్రజలను వార్డుల్లో పలకరించగా సన్న బియ్యం కొన్ని సిసి రోడ్లు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పరీక్షలు వ్రాసి అర్హులు అయితే ప్రవేటు ఉద్యోగాలు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీనవర్గాలకు స్లం ఏరియాలకు పేరు ఉన్నదని అభివృద్ధి విషయంలో ముందంజలో ఉంటుందని ఎమ్మెల్యే మేగారెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ కౌన్సిల ర్ లుగా పోటీ చేసే అభ్యర్థులను గెలిపించి చైర్మన్ గా ఎన్నుకొవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వనపర్తి అభివృద్ధి చేసుకుందామని అన్నారు ఇంకా రెండో వార్డులో కొంతమంది ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మించుకోవడానికి ఆర్థిక స్తోమత స్థలం లేదని మాకు డబుల్ బెడ్ రూములు కేటాయించాలని నిరుపేదలు అడిగారని ఈ విషయం అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్తు ఇనుప స్తంభాల గురించి ఎమ్మెల్యే దృష్టి కి తెచ్చారుఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ కాంగ్రెస్ నేతలు తైలం శేఖర్ ప్రసాద్ రహీం మీడియా సెల్ కోఆర్డినేటర్ డి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు ఉన్నారు