MLA Thudi Mega Reddy Felicitates Newly Elected Congress Sarpanches
కాంగ్రెస్ పార్టీ నుండి నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానం చేసిన ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి నియోజకవర్గంలో 1 వ విడత 2 వ విడతలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించినందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు . చిన్నపాక రాములు సవాయిగూడెం సురేష్ కాసిం నగర్ కుడికిల కుడికిల్ల వెంకటేష్ చిమన గుంటపల్లి నీలమ్మ తూర్పు తాండ సాలమ్మ బాలు పెద్దగూడెం తాండ జయమ్మ రూప్ సింగ్ నాచహుల్లి అబ్దుల్లా దత్తాయిపల్లి వెంకటయ్య మంజుల శ్రీశైలం వీరితో పాటు ఉప సర్పంచ్ లను వార్డు సభ్యులను ఎమ్మెల్యే మెగారెడ్డి సన్మానం చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా ఎన్నికైన వారు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గ్రామాల అభివృద్ధికి సర్పంచులకు అండగా ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఉప సర్పంచ్ లకు వార్డు సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నేతలకు హామీ ఇచ్చారు
