
MLA Ensures Proper Treatment for Snake Bite Victim
పొట్ పల్లి గ్రామానికి మొగలయ్య మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పొట్ పల్లి గ్రామానికి చెందిన
మొగలయ్య పాముగా కాటుకు గురై చికిత్స కొరకు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి లో చేరారు విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఆసుపత్రి కి చేరుకుని ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకుని, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు, అండగా ఉంటాం అని కుటుంబసభ్యులకు మనోధైర్యన్ని కలుగజెసారు ఎమ్మెల్యే గారితో పాటుగా ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,కోహీర్ మండల మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,గ్రామ నాయకులు సిద్దన్న పటేల్, శాంత్ కుమార్, బసప్ప,మాణిక్యప్ప,రామన్న తదితరులు ఉన్నారు.