
రైల్వే శాఖ మంత్రి ని కలిసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లాలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యేలు వరంగల్ పశ్చిమ నాయిని రాజేందర్ రెడ్డి స్టేషన్ గణపూర్ కడియం శ్రీహరి,వర్ధన్నపేట కె.నాగరాజు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి గారినీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
కొత్త రైల్వే స్టేషన్ లైను ద్వారా పరిశ్రమలు ఏర్పాటకి అవకాశం ఏర్పడుతుందని, బొగ్గు గనులకి నిలయమైన భూపాలపల్లి జిల్లాలో కొత్త రైల్వే స్టేషన్ అవసరం ఎంతగానో ఉందని బొగ్గు రవాణా,వ్యవసాయ ఉత్పత్తుల రవాణా,రహదారి ప్రమాదాల నివారణకు దోహదపడుతుందన్నారు
ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ,త్వరలోనే తగిన నిర్ణయాలు తీసుకుంటాను” అని హామీ ఇచ్చారు అని అన్నారు