పనులు వేగవంతంగా పూర్తి చేయాలి.
ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి
మహబూబ్ నగర్ పట్టణం సమీపంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న జంతు వధశాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ పట్టణం లోని కోయిల్ కొండ చౌరస్తా రోడ్ లో నూతనంగా నిర్మిస్తున్న జంతు వధశాల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జంతు వధశాలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి గారికి సూచించారు. జంతు వధశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని , పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి , ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, రఘుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.