భూపాలపల్లి నేటిధాత్రి
ఈ సమాజంలో వైద్యవృత్తి పవిత్రమైనదని, వైద్యులు దైవ సమానులని భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ వద్ద మెయిన్ రోడ్డులో డాక్టర్ వి.దివ్య ఎమ్ ఎస్ జనరల్ సర్జన్, కోరిమి రవితేజ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దివ్య హాస్పిటల్ ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్తన్న మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా లాంటి వెనుకబడిన ప్రాంతంలో వైద్యులుగా పనిచేయడం అనేది పేద ప్రజలకు సేవ చేసినట్టేనని ఈ ప్రాంతంలో వ్యాపార ధోరణితో కాకుండా ప్రజాసేవతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ ప్రాంతంలో అనేక పేదలు ఉన్నారని వారికి తగిన సమయంలో వైద్యం అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ హాస్పిటల్ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెంది ప్రజల మన్ననలు పొందాలని కోరారు. భూపాలపల్లి లాంటి పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో జనాభాకు అనుగుణంగా ఇంకా ఎన్నో ఆసుపత్రులు రావాలని ఆయన కోరారు. నూతనంగా ఏర్పాటుచేసిన ఆస్పటల్ డాక్టర్ వి. దివ్య ను యాజమాన్యం హాస్పటల్ సిబ్బందిని గండ్ర సత్యనారాయణ రావు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, డాక్టర్లు కిరణ్, ప్రధాన్, గోపీచంద్, సిపిఐ జిల్లా సమితి నాయకురాలు కోరిమి సుగుణ,మున్సిపల్ వైస్ చైర్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి ఎం. రమేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖ్యాత రాజు సతీష్, ఏఐటీయూసీ నాయకులు మాతాంగి రామచందర్, గురుజేపల్లి సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు అప్పం కిషన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, బుర్ర కొమురయ్య, సాంబమూర్తి, కౌన్సిలర్లు శిరుప అనిల్, దాట్ల శ్రీనివాస్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.