రామడుగు, నేటిధాత్రి:
చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ భర్త గాలన్న మృతి పట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గాలన్న మృతదేహానికి పూలమాల వేసి ప్రగాఢ సంతాపం తెలియజేశి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గాలన్న పోరాడారని గుర్తు చేసుకుంటూ ఈకష్ట సమయంలో వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, తదితరులు పాల్గొన్నారు