
గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసి మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని చెక్కులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే సత్తన్న అన్నారు రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అభివృద్ధితోపాటు పేద ప్రజల సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం, ఆరోగ్యశ్రీ పెంపు ,సబ్సిడీపై గ్యాస్, ఉచిత 200 యూనిట్ల విద్యుత్ ,ఇచ్చిన హామీల్లో కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కావటి రజిత-రవీందర్, వైస్ ఎంపీపీ విడి దినేని అశోక్, పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్, కోఆప్షన్ సభ్యులు ఎండి చోటేమియా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్, ఎంపీటీసీ కాలియా సాగర్, నాయకులు వడ్లకొండ నారాయణ గౌడ్, గుజ్జ గంగాధర్ రావు, బోనాల రాజమౌళి, ఓద్దుల అశోక్ రెడ్డి, మామిండ్ల మల్లికార్జున గౌడ్, కటుకూరి శ్రీనివాస్, మామిడి నరసింహ స్వామి, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.