పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.కేక్ కట్ చేసి ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెబుతూ భారతదేశానికి భిన్నత్వంలో ఏకత్వం అని,మానవ సమాజానికి లోక రక్షకుడైన ఏసు జన్మదినం జరుపుకోవడం చాలా గొప్పగా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పండుగగా శుభపరిణామం తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎసిపి చిర్ర సతీష్ బాబు,సిఐ క్రాంతి కుమార్,పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,పరకాల మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ,మాజీ ఎంపీటీసీ పర్నెం మల్లారెడ్డి,ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,బొచ్చు జెమిని,పరకాల,ఆత్మకూరు, దామెర,నడికూడ మండలాల పాస్టర్లు,పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు వివిధ శాఖల అధికారులు,క్రైస్తవులు పాల్గొన్నారు.