అమరదామంలో జాతీయ పథకాన్ని ఎగరవేసిన ఎమ్మెల్యే
పరకాల నేటిధాత్రి
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు అమరదామంలో పరకాల ఎమ్మెల్యేరేవూరి ప్రకాశ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైన రోజున రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైందని అందుకే సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నదని అన్నారు.ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు తీసుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.స్వరాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత జయ జయహే తెలంగాణ జయకేతనమంటూ అధికారిక గీతంతో తెలంగాణ తల్లిని సమున్నతంగా గౌరవించుకోవడం గర్వకారణమని,ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రజాప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు.