నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా
నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు మరియు ఆయన సతీమణి సరిత రాజేష్ రెడ్డి గారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు కళ్యాణోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు శ్రీపురం గ్రామ సర్పంచ్ గీతా నర్సింహారెడ్డి నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పదో వార్డు మాజీ కౌన్సిలర్ బాదం సునీత ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
