MLA Pays Tribute to Mortal Remains
పార్థివదేహానికి నివాళాలు అర్పించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పాండురంగా వీధి కి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోట్రీకె చంద్రశేఖర్ గారి తల్లి పద్మావతి మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వారి నివాసానికి చేరుకొని పార్థివదేహానికి నివాళాలు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎమ్మెల్యే గారితో పాటుగా మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,నాయకులు ఆర్ సుభాష్, జాహెద్,నాగరాజ్ ,మహిళ నాయకురాలు పద్మజ తదితరులు ఉన్నారు.
