MLA Pays Tribute to Dr. Ambedkar
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం
◆ :— ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సంధర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అనంతరం మాట్లాడుతూ, “అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే ప్రతి భారత పౌరుడికి హక్కులు, గౌరవం, అవకాశాలు కల్పించింది. సామాజిక సమానత్వం కోసం ఆయన జీవితాంతం పోరాడిన ధైర్యసాహసాలు సర్వదా స్ఫూర్తిదాయకం ” అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,యువ నాయకులు మిథున్ రాజ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,బరూర్ దత్తాత్రి,గణేష్,చంద్రయ్య,అలీ,సలీం,వెంకట్,నరసింహ రెడ్డి, ఇబ్రహీం ,జుబేర్,వెంకట్ సాగర్, లక్ష్మీ కాంత్, జాకీర్, మోహన్,బి ఆర్ ఎస్వీ నాయకులు ఫయాజ్,రఘు తేజ,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
