ఆలయాధ్వజస్తంభాల ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

MLA participated in the temple flagpole installation ceremony

ఆలయాధ్వజస్తంభాల ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్.

చిట్యాల, నేటిధాత్రి :

భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలం ఒడితల గ్రామంలో మూడు రోజుల నుండి శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం, శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం మరియు బద్ది పోచమ్మ తల్లి దేవాలయాలల్లో ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. కాగా, సోమవారంరోజున జరిపిన ధ్వజస్తంభాల ప్రతిష్టాపన మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ నిర్వాహకులు, కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేణుగోపాలస్వామి, రామలింగేశ్వరస్వామి, బద్ది పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఒడితల గ్రామంలోని
కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలను అభివృద్ది చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేకు పలువురు శాలువాలు కప్పి సన్మానం చేశారరు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మన వంశ కృష్ణ జిల్లా నాయకులు చిలుకల రాయ కొమురు కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!