మిషన్ భగీరథ, సానిటేషన్ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం

#పట్టణ ప్రజలకు త్రాగునీరు, పారిశుద్ధ్య పనులు తక్షణమే అందించాలి

# ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

# మున్సిపాలిటీ అధికారులతో సమీక్షా

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని నిర్వహిస్తున్న మిషన్ భగీరథ, సానిటేషన్ పనులపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ అధికారులతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రజలకు తాగినీటి సమస్యను పరిష్కరించడంతోపాటు పారిశుద్ధ్యం బందీగా నిర్వహించాలని లేకపోతే అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే దొంతి హెచ్చరించారు.ఈ సందర్భంగా పట్టణంలోని పారిశుద్ధ్యం అటుకెక్కిందని ,మిషన్ భగీరథ పనులు ఇతర అభివృద్ధి పనులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.రూ. రెండు కోట్లతో నిర్మించిన కూరగాయల మార్కెట్ భవనం ఎందుకు వినియోగంలోకి ఏర్పాటు చేయలేదని వాటిపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పేరుతో రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయని, పారిశుద్ధ్యం పనులు పూర్తిస్థాయిలో నిర్వహించడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే వారం రోజుల్లో పారిశుధ్యంపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. మిషన్ భగీరథ పనులు మార్చి చివరికల్లా పూర్తి చేసి పట్టణ ప్రజలకు ప్రతిరోజు నీరు ఇచ్చేవిధంగా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అనంతరం డి ఫ్లోర్ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని అట్టి ప్రాజెక్టును నర్సంపేట పట్టణానికి త్రాగునీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని గ్రీన్ ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ వెంచర్లపై పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు.మున్సిపాలిటీలో అధికారుల కొరత నివారించాలని అన్ని విభాగాలకు అధికారులను నియమించాలని, అందుకు సంబంధించిన వివరాలను అందించాలని కమిషనర్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, కౌన్సిలర్లు బత్తిని రాజేందర్, ఎలకంటి విజయకుమార్, పెండెం లక్ష్మి, ములుకల వినోద, ఓర్సు అంజలి మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *