నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని రాయపర్తి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఫ్లెక్సీ ల రూపంలో గ్రామాలలో ఏర్పాటు చేయాలని కోరారు.
ఆర్థిక సర్దుబాటు చేసుకుంటూ అంచలంచలుగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని,ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 ఉచిత కరెంట్,500 రూ వంట గ్యాస్,రెండు లక్షల లోపు రైతురుణ మాఫీ, ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు అమలు చేస్తున్నామన్నారు
తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు, సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దామని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో పెట్టి ప్రజలకు వివరించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని అన్నారు.రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నదనే సంగతి ఏ సందర్భంలో కూడా తెలియజేయలేదు అని అన్నారు.
గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా, నాణ్యమైన పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తుంటే, బిఆర్ఎస్ నాయకులు కావాలనే అసత్యపు ప్రచారాలు చేస్తున్నరని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ దేయమని తెలిపారు. ఏకకాలంలో 2 లక్షల లోపు రైతు రుణ మాఫీ చేసామన్నారు.
పంట బోనస్ 500/- ప్రకటనతో పెరిగిన సన్నాలు సాగు పెరిగిందని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రైతు కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి అని తెలిపారు.