
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మాచారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కాంక్రీట్ మిక్సింగ్ పాయింట్ ను దానివల్ల దుమ్ము, ధూళి విపరీతంగా వస్తుందని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కి విన్నవించారు.
సందర్భంగా ఎమ్మెల్యే తక్షణమే స్పందించి నేడు గ్రామంలోని కాంక్రీట్ మిక్సింగ్ పాయింట్ దగ్గరికి వెళ్లి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.
ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్న కాంక్రీట్ మిక్సింగ్ పాయింట్ ను వెంటనే నిలిపివేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు