మహబూబాబాద్,నేటిధాత్రి:
మహబూబాబాద్ లో శుక్రవారం కాసం పుల్లయ్య అండ్ సన్స్ ఒక బారి బట్టల షో రూం బ్రాంచ్ నీ ఎమ్మేల్యే శంకర్ నాయక్ గారిచే ప్రారంభించారు.దాదాపు ఈ బారి బట్టల షో రూం లో 120 మంది మహబూబాబాద్ ప్రాంతానికి చెందినవారికి ఉపాధి దొరికింది.మొదటి నుండి కాసం యాజమాన్యం ఎమ్మేల్యే శంకర్ నాయక్ కుటుంబానికి తోడుగా ఉంటుంది.మహబూబాబాద్ లో షో రూం ప్రారంభించాలని కొద్ది రోజుల క్రితం ఎమ్మేల్యే సలహా ఇవ్వడంతో వారు నేడు ప్రారంభించారు.కానీ మొదటి నుండి ఎమ్మేల్యే మిరు ప్రారంభించే షో రూంలో మహబూబాబాద్ వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఆ విజ్ఞప్తిని స్వీకరించిన యాజమాన్యం ఎమ్మేల్యే కి ఇచ్చిన మాట ప్రకారం నేడు స్థానిక యువతి యువకులకు 120 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ జంట నగరాలకు తీసిపోకుండా నేడు అందుబాటులోకి ప్రతిదీ మహబూబాబాద్ కేంద్రంలో దొరుకుతుందని రానున్న రోజుల్లో ఇంకా ప్రజల అవసరార్థం అభివృద్ధి జరుగుతుందని అన్నారు.కాగా ఈ ప్రారంభ కార్యక్రమానికి కథానాయిక మెహరిన్ వచ్చి అలరించారు.కాగా ఎమ్మేల్యే సతీమణి డాక్టర్ సీతామాలక్ష్మి తనను సత్కరించి జ్ఞాపికను అందజేసారు.వారి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్ ఉన్నారు.