మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని అమ్మాపుర్ ఎంపీటీసీ భాగ్యశ్రీ నరసింహులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ వి ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..
విషయం తెలుసుకున్న జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి శుక్రవారం రోజు ఎస్ వి ఎస్ ఆసుపత్రిలో ఆమెను పరామర్శించి ఆమె ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు.