కల్పవృక్ష నారసింహస్వామికి ముడుపులు కట్టిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబం

భద్రాచలం నేటి ధాత్రి

పల్లెలన్నీ కల్పవృక్ష నారసింహుని దర్శనం కొరకు క్యూ కడుతున్న వైనం

కోరికొలిస్తే కోరిక తీరినట్లేనని బారులు తీరుతున్న భక్తులు

భద్రాద్రిలో కొలువై ఉన్న కల్పవృక్ష నారసింహస్వామి కోరిన కోర్కెలు తీరుస్తున్నాడని నమ్మి ముడుపు కడితే రక్షణ ఇచ్చి కాపాడుతూ ఆర్తజన రక్షకుడుగా నిలిచే దైవం కల్ప వృక్ష నారసింహుడని భక్తుల నమ్మకం. ఏనోట విన్నా కల్పవృక్ష నారసింహుని దివ్య లీలల గురించే స్వామివారి లీలలు అమోఘం అద్భుతం అంటూ పరవశించి పోతున్న భక్తులు.ఇక్కడ ముడుపులు కడితే కోరికలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం ఒకవైపు మేడారం జాతరకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఎంతో మంది భక్తులు స్వామివారికి ముడుపులు చెల్లించి తరిస్తున్నారు.
ప్రతి నిత్యం భక్తుల రాకతో కిటకిటలాడుతున్న కల్పవృక్ష నారసింహ సన్నిధిని ఈరోజు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శనం చేసుకొని ముడుపులు కట్టుకోవడం జరిగినది.కల్పవృక్ష నారసింహ ఆశ్రమం నిర్వాహకులు డా కృష్ణ చైతన్య స్వామి ప్రత్యేక పూజలు చేసి నృసింహ రక్ష మరియు సాలగ్రామ తీర్దాన్ని అందజేశారు. ఆర్థిక పరిస్థితి, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగం కొరకు ప్రతినిత్యం భక్తులు ముడుపులు కట్టుకోవడం ఇక్కడ విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!