హనుమకొండ, నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా ఎంజీఎం దవాఖానలో సుమలత అనే ఉద్యోగిని పై నిన్న జరిగిన ఘటనకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. ఇలాంటి ఘనటన పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుమలత పై దాడి చేసిన రాజమ్మ అనే మహిళ గతంలో ఎంజీఎం లో విధులు నిర్వహించినప్పటికి తనపై ఉన్న అభియోగల పట్ల విధులనుంచి తొలగించడం జరిగిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇలాటి ఘటనలను ఉపేక్షించేది లేదు అని నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
భవిష్యత్ మళ్ళీ వైద్యుల పట్ల కానీ, వైద్య సిబ్బంది పట్ల కానీ ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పపడితే రౌడీ షీట్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.