MLA Nagaraju Visits Bereaved Families
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు
వర్దన్నపేట( నేటిధాత్రి):
వర్దన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామానికి చెందిన ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎద్దు శ్రీనివాస్ తండ్రిగారైన ఎద్దు బచ్చన్న అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు.అనంతరం అదే గ్రామానికి చెందిన మైనారిటీ నాయకులు మహమ్మద్ మైబ్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి నివాసానికి వెళ్లే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మన ధైర్యం కల్పించారు..
తదనంతరం కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా నేడు వారి నివాసానికి వెళ్లి అతని పరామర్శించి మనోధైర్యం కల్పించారు..
ఈ కార్యక్రమంలో ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, వర్ధన్నపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోశాల వెంకన్న గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు ఎద్దు రాజేంద్ర ప్రసాద్, గుంటి కుమారస్వామి, గడ్డం సమ్మయ్య, బుర్ల రవి, సమ్మేట యాకయ్య తో పాటు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
