
MLA Nagaraju
బాధిత కుటుంబానికి LOC అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు
ఆపధకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యేనాగరాజు కృతజ్ఞతలు తెలిపిన మంద రిషిత్ కుటుంబ సభ్యులు.
*రూ. 7,00,000/-ల LOC వారి కుటుంబసభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు
వర్దన్నపేట (నేటిధాత్రి ):
వర్ధన్నపేట నియోజకవరం వర్ధన్నపేట మండల పరిధి లోని చెన్నారం గ్రామానికి చెందిన మంద నాగరాజు కుమారుడు మంద రిషిత్ 3సం. చెవ్వు సమస్యలతో బాధపడుతున్న క్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ప్రత్యేక చొరతో కోటి ప్రభుత్వ ENT ఆస్పత్రికి లో చికిత్స కోసం బాధిత కుటుంబానికి రూ. 7,00,000/-ల (7లక్షల రూపాయల LOC ) కాపీని నేడు హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయం నందు బాధిత కుటుంబ సభ్యులు అందజేశారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడిగా నా దృష్టికి వచ్చిన అనారోగ్య సమస్యల పట్ల నా వంతు సహాయ సహకారం అందించే కృషి చేస్తానని తెలిపారు…
నా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికి విజ్ఞప్తి లక్షల రూపాయలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆసుపత్రిల దోపిడికి గురై అప్పుల పాలు కావద్దు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ నిమ్స్ హాస్పిటల్ వెళ్లి నేను ఇచ్చే ఎల్వోసీ ద్వారా ఉచిత చికిత్స పొందాలనీ ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే నాగరాజు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా బాధిత కుటుంబ సభ్యులు మంద నాగరాజు, కొమురమ్మ ఎమ్మెల్యే నాగరాజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి, తమ కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, వర్ధన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోశాల వెంకన్న, ఓబీసీ జనరల్ సెక్రటరీ ఉప్పరపల్లి యాదగిరి, మండల యూత్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్, బర్ల సతీష్, మాజీ గ్రామ సర్పంచ్ సింధం లక్ష్మి నారాయణ, కల్లెపు రాజు, తో పాటు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు….