
MLA Nagaraju Visits Families of the Deceased
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా యూత్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ గారు…
పర్వతగిరి (నేటిధాత్రి)
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన పర్వతగిరి మండల యూత్ అధ్యక్షుడు గొడుగు వినయ్ గారి నానమ్మ గొడుగు లచ్చమ్మ నిన్న అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్
అనంతరం కల్లెడ గ్రామానికి చెందిన మద్దెల శ్రీనివాస్, బాల్లె వెంకటయ్య ఇటివల అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసాలకు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అదే విధంగా నిన్న కల్లెడ గ్రామంలో కురిసిన అకాల వర్షంతో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామంలో శాశ్వత డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే స్పష్టంగా తెలిపారు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు