ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి. ఈసందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోపే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని, ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి ముదిరాజ్, తహశీల్దార్ వెంకటలక్ష్మి,ఎంపీడీఓ రాజేశ్వరి, కొక్కరకుంట సింగిల్ విండో చైర్మన్ మురళీకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్, మాజీ సర్పంచ్ కోల రమేష్, మార్కెట్ వైస్ చైర్మన్ పిండి సత్యం, ఐకేపీ సిబ్బంది, పంజాల శ్రీనివాస్ గౌడ్, బాపురాజు, అసిఫ్, మార్కెట్ డైరెక్టర్లు మోలుగురి రాజశేఖర్ గౌడ్, మేకల స్వామి, శంకరయ్య, నారాయణ, ఎల్లయ్య, వేణుగోపాల్ రెడ్డి, జక్కుల బాబు, కనుకయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *