రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యం. ఈసందర్భంగా చోప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని, చొప్పదండి నియోజకవర్గంలో ఇంట్లో పెద్ద కొడుకులా ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని, హైదరాబాద్ వేదికగా సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించారని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను తప్పకుండా అమలు చేసి తీరుతానని, ఇప్పటికే రెండు గ్యారెంటీలను ప్రారంభించడం జరిగిందని, మరో నాలుగు గ్యారంటీలను త్వరలోనే ప్రభుత్వం ప్రారంభిస్తుందని, ఇరవైనాలుగు గంటల విద్యుత్ రాదంటూ ప్రతిపక్షాలు చిల్లర రాజకీయం చేస్తున్నాయని, ప్రజలు, రైతులు వారి మాటలను నమ్మి ఆందోళనకు గురికావద్దని, ప్రభుత్వం ఇరవైనాలుగు గంటల విద్యుత్ ను అందజేస్తుందని, రైతులు పండించిన ధాన్యానికి ఇరవై ఐదు వందల మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మహిళల కళ్ళలో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో మహిళల కోసం రాష్ట్రంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారని, అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన గొప్ప నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని, అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని అప్పుల పాలు కావద్దన్న ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పదిలక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేయించుకోనేలా చేశారని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎలాంటి జబ్బుకైనా కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకొని ఉచితంగా వైద్య చికిత్స చేయించుకోవాలని, ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశరాజుపల్లె గ్రామాన్ని దత్తత గ్రామంగా తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్న మాట నిలబెట్టుకుంటాను అని తెలియజేశారు. అనంతరం గ్రామ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన సందర్భంగా దేశరాజుపల్లి గ్రామం నుండి గంగాధర మండల కేంద్రంలోని బస్టాండ్ వరకు బస్సులో ప్రయాణం చేసిన ఎమ్మెల్యే. ఈకార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఎంపిపి కలిగేటి కవిత, గ్రామ సర్పంచ్ కోల రమేష్, ఎంపీటీసీ వంచ మహేందర్, పిడి డిఆర్డిఏ శ్రీలత, తహసీల్దార్ భాస్కర్, ఎంపిడిఓ భాస్కర్ రావు, అసిస్టెంట్ డిఎంహెచ్ఓ జుబెరియా బేగం, ఆర్టీసీ డిపో మేనేజర్, మండల వైద్యాధికారి రమేష్, ఏఎన్ఎంలు, అసిస్టెంట్ ఏఎన్ఎంలు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.