
MLA Manik Rao v
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రె కంటి శంకరమ్మ అనే మహిళ బుధవారం ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలినట్లు తెలిసింది. ప్రమాదంలో శంకరమ్మ తో పాటు ఆమె కుమారులు ప్రభు, విట్టల్ లకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ,విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు నాయకులతో కలిసి ఆసుపత్రి కి చేరుకుని , ప్రమాద వివరాలు కుటుంబ సభ్యులను ,గ్రామస్తులను అడిగి తెలుసుకునారు డాక్టర్ ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అంబులెన్స్ లలో జిల్లా ఆసుపత్రి కి తరలించారు ,ఎమ్మెల్యే డాక్టర్ లతో మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అన్నారు,త్వరగా కోలుకుంటారు అని అధైర్యపడొద్దు అని,అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని తెలిపారు* ….
అనంతరం ఆసుపత్రి లో అనారోగ్యంతో బాధపడుతున్నవారితో మాట్లాడుతూ వారికి అందుతున్న చికిత్స వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు మరియు సిబ్బంది సూచించారు .ఎమ్మెల్యే గారితో పాటుగా ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి, ప్రభు పటేల్ ,నాయకులు నరేష్ రెడ్డి ,శంకర్,నవీన్ తదితరులు ఉన్నారు..