MLA Assures Support to Grieving Family
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని శాసనసభ్యులు మాణిక్ రావు …
జహీరాబాద్ నీటి ధాత్రి:
జహీరాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని రాచన్నపేట్ లో నివాసముండే అప్పం రజిత బతుకు తెరువు కోసం తన ఇరువురు పిల్లలతో హైదరాబాదులోని బోరబండా ప్రాంతంలో ఉంటున్నారు కుమారుడు నందకిషోర్(14 సంవత్సరాలు) గత వారం రోజుల క్రితం గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు గాలిపటం చిక్కుకోవడంతో విద్యుత్ షాక్ వచ్చి ఎక్కువ మొత్తంలో శరీరం కాలిపోయి ఆసుపత్రిలో నాలుగు రోజులు చికిత్స పొంది రెండు రోజుల క్రితం మృతి చెందడం జరిగింది శాసనసభ్యులు మాణిక్ రావు రాచన్నపేట్ లోని వారి ఇంటికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్నారుకుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అధైర్యపడొడ్డు అండగా ఉంటాం అని భరోసా కల్పించారు తల్లి జీవన ఆధారం కొరకు తమ వంతు సాయం చేస్తాం అని అన్నారు
ఎమ్మెల్యే పాటుగా మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, ఆర్ సుభాష్ ,స్థానిక నాయకులు నందు గౌడ్, తులసి మక్కని తదితరులు ఉన్నారు,
