
"MLA Manik Rao Inspects Flooded Colony"
నీట మునిగిన కాలనీ, స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
కుండ పోత వర్షానికి పట్టణ పరిధిలోని డ్రీమ్ ఇండియా కాలనీ, ఇతర ప్రాంతాలు నీట మునిగాయి ,ఇళ్లల్లోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు కాలనీలలో స్వయంగా వరద నీటిలోనికి దిగి నీట మునిగిన ఇళ్లను, ప్రవాహాన్ని స్వయంగా తమ ఫోన్ లో ఫోటోలు తీసి ఉన్నత అధికారులకు పంపించారు. అధికారులతో స్వయంగా చరవాణి ద్వారా మాట్లాడారు. కాలనీ వాసులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆధైర్య పడకండి అండగా ఉంటానని వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వర్షపు నీటిని బయటకు పంపించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అక్కడికి వచ్చిన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వర్షం కురుస్తున్నందున అధికారులు పర్యవేక్షిస్తూనే ఉండాలని తెలిపారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని ప్రజలకు తెలియజేశారు.
ఎమ్మెల్యే గారితో పాటు గా మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు .