డా; బాబా జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్. నేటి ధాత్రి:
డా; బాబా జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల నేత, దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, దేశ మాజీ ఉప ప్రధాని ‘బాబూజీ’ అని అన్నారు.ఎమ్మెల్యే గారితో పాటుగా న్యాల్కల్ మండల జెడ్పీటీసీ స్వప్న భాస్కర్,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిమ్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహిద్దీన్,మాజి మొగుడంపల్లి మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు సురేష్,మాజి సర్పంచ్ లు విజయ్ , జగ్దిష్,దేవదాస్,యువ నాయకులు మిథున్ రాజ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,గణేష్, చంద్రయ్య,వినోద్,ప్రభాకర్,దీపక్,శంత్ కుమార్,నగేష్,ప్రవీణ్ మెస్సీ,తదితరులు పాల్గొన్నారు.