పాఖాల నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే మాధవ రెడ్డి
*జులైలోనే నీటిని విడుదల చేయడం సంతోషకరం”
ప్రొఫెసర్.జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్.డాక్టర్ జానయ్య
నర్సంపేట,నేటిధాత్రి:
రబీ సీజన్ ఆలస్యం కాకుండా
జులైలోనే నీటిని విడుదల చేయడం సంతోషకమని ప్రొఫెసర్.జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్.డాక్టర్ జానయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రొఫెసర్.జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్.డాక్టర్ జానయ్యతో కలిసి .నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలోని పాఖాల తూముల గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలువలలోని చెత్త,చెదారాన్ని నిధులు కేటాయించి తొలగించడం జరిగిందని,వచ్చే సీజన్ వరకు మిగిలిపోయిన కాలువల లైనింగ్ కొరకు నిధులు విడుదల చేయించి చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.జనయ్య మాట్లాడుతూ రబీ సీజన్ పంట కోత దశకు చేరుకొనే నాటికి జూన్ మాసం రావడంతో అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోతున్నారని గ్రహించిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గత నెలలో రైతులు,వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారని అన్నారు. రైతుల నుండి అభిప్రాయాలు సేకరించి,రైతుల కోరిక మేరకు ఆగస్టు నెలలో కాకుండా జులై నెలలోనే పాకాల నీటిని అందిస్తే ఈ సమస్య ఉత్పన్నం కాదని తెలపడంతో ఈ రోజు చెప్పిన ప్రకారం నేడు దొంతి మాధవ రెడ్డి జూలైలోనే నీటిని విడుదల శుభ పరిణామం అని,ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్. వెంకట నారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,ఇరిగేషన్ ఈఈ సుదర్శన్,ఇతర అధికారులు,నాయకులు పాల్గొన్నారు.